కొనుగోళ్లు షురూ


Wed,April 17, 2019 02:00 AM

- రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
- కొన్ని చోట్ల మొదలైన కొనుగోళ్లు
- జిల్లావ్యాప్తంగా 178 కేంద్రాల ఏర్పాటు
- మద్దతు ధర ఏ గ్రేడు రకానికి 1,770
- సాధారణ రకానికి 1,750
- కొనుగోళ్లపై కలెక్టర్, జేసీ ప్రత్యేక దృష్టి
- విక్రయించిన 48గంటల్లో డబ్బుల చెల్లింపునకు చర్యలు
- రైతు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌లో జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. యాసంగి సీజన్‌లో జిల్లాలో 40,018 హెక్టర్లలో వరి సాగు చేశా రు. హెక్టారుకు గరిష్టంగా 62 నుంచి 65క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అంటే దాదాపుగా 2,20,000 నుంచి 2,40,000 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 10శాతం దిగుబడి తినేందుకు నిల్వ చేసుకున్న, మరో 10 శాతం ధాన్యం విత్తనాల కోసం కంపెనీలు సేకరిస్తాయి. ఇదీ పోను జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అంచనా వేసి కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం జిల్లాలో 178 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 130, మహిళా సంఘాల ద్వారా 48 కేంద్రాలు ఏ ర్పాటవుతున్నాయి. ప్రస్తుతం వరి కోతలు ప్రారం భం కావడంతో ఇప్పుడిప్పుడే ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తుండగా ఇప్పటి దాకా జిల్లాలో 29 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈఏడాది వరికి ప్రభుత్వం కనీస మద్దతు ధరను కామన్ రకానికి క్వింటాల్‌కు 1,750, గ్రేడ్ ఏ రకానికి 1,770 చెల్లిస్తారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ శ్రీదేవసేన, జేసీ వనజాదేవి ప్రత్యేకంగా దృ ష్టి సారించారు. విక్రయించిన ధాన్యానికి 48 గంటల్లోనే డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు.

రైతులకు సూచనలు
రైతులు 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించాలని అధికారులు సూచించారు. రైతులు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు పట్టాదారు పాసు పుస్తకం తీసుకొని రావాలని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వస్తున్న రైతు లు టార్పాలిన్లు వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు.

కొనుగోళ్ల సమన్వయానికి
ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో రైతులకు ఎదురైయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ధాన్యం అమ్మకాల సం దర్భంగా రైతులకు ఏమైన సమస్యలు వస్తే 77806-69039 అనే నెంబర్‌కు ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల దాకా ఫోన్ చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా సమన్వయం కోసం సహకార శాఖలో పని చేస్తున్న 11మంది అధికారులతో ఒక కమిటీ వేశారు. వారు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తారు. కామ న్, గ్రేడ్ ఏ రకం ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాల నిర్వాహకులకు ఏమైన ఇబ్బందులు వస్తే ధాన్యాన్ని పరిశీలించేందుకు మండల వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)లకు బాధ్యతలు అప్పగించారు. ధాన్యం కొనుగోళ్లలో ఏలాంటి అక్రమాలు జరుగకుండా కేంద్రాలను జియో ట్యాగింగ్ చేశారు. అలాగే ధాన్యం రవాణా చేస్తున్న లారీలకు సైతం జీపీఆర్‌ఎస్ సిస్టం ద్వారా కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లు దాకా పర్యవేక్షిస్తున్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...