కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి


Wed,April 17, 2019 01:59 AM

కమాన్‌పూర్: కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలనీ, ఓట్ల కోసం చెప్పే మాయమాటలు నమ్మకుండా వచ్చే పరిషత్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. అలాగే మంథని నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో త్వరలోనే పెద్దపల్లి జిల్లా పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కాబోతోందని, తనపై సీఎం కేసీఆర్ నమ్మకంతో జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ తొలి జాబితాలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గంలోని కమాన్‌పూర్ మండలానికి వచ్చిన పుట్ట మధుకు టీఆర్‌ఎస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం మండలకేంద్రంలోని ఆదివరాహస్వామి కల్యాణ మండపంలో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట మధును నాయకులు గజమాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను పెద్దపల్లి జడ్పీ చైర్మన్ అయితే రాబోయే కాలంలో మంథని నియోజకవర్గ, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లిని రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా మార్చేందుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. కమాన్‌ఫూర్ మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తానని, మండల ప్రజలు తన కు వేసే ప్రతి ఓటు జిల్లా వెలుగు కోసం వేసే ఓటేనన్నారు.

ప్రతిపక్షాలకు చెందిన వారు తమ పార్టీల నుంచి అభ్యర్థులను బరిలో నిలపకుండా సహకరించాలని కోరారు. మంథని నియోజకవర్గ ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో 2014లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే గతంలో ఎవరూ చేయని పనులను సైతం చేసి చూపించాననీ, ఇందుకు అహర్నిషలు కృషి చేశానని ఉద్ఘాటించారు. తన తల్లి పుట్ట లింగమ్మ పేరిట ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు సేవా కార్యక్రమాలను చేశానని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజకవర్గంలోని భూములను పూర్తిస్థాయిలో సస్యశ్యామలం చేసే దిశగా తగు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నా రు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మంథని నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి జిల్లా సస్యశ్యామలం కాబోతుందన్నారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా తన పేరును ప్రకటింపజేసేందుకు సహకరించిన మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహార్‌రెడ్డి, కోరుకంటి చందర్, బాల్క సుమన్‌లతో పాటు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, జడ్పీటీసీ మేకల సంపత్‌యాదవ్, నాయకులు ఇనగంటి రామారావు, పూదరి సత్యనారాయణ, గుర్రం లక్ష్మీమల్లు, నీలం సరిత, శ్రీనివాస్, బొల్లపెల్లి శంకర్‌గౌడ్, తాటికొండ శంకర్‌లతో పాటు అధిక సంఖ్యలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పలువురి చేరిక..
పుట్ట మధు సమక్షంలో జూలపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు దాసరి శంకర్‌తో పాటు పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆ గ్రామ సర్పంచ్ బొల్లపెల్లి శంకర్‌గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

మంథనిలో ఘన స్వాగతం..
మంథని, నమస్తే తెలంగాణ: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా మంథనికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారి పట్టణంలోని పీవీ చౌక్ వద్ద టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నినాదాలు చేస్తూ టపాసులు పేల్చుతూ పుట్ట మధుకు స్వాగతం పలికారు. మంథని ఎంపీపీ ఏగోళపు కమల ఆధ్వర్యంలో పుట్ట మధుకు విజయతిలకం దిద్ది పూలమాలలు వేసి సత్కరించారు. పీవీ చౌక్ నుంచి కార్యకర్తలతో ర్యాలీగా పుట్ట మధు మంథని పట్టణ పురవీధులు జగ్జీవన్‌రాం చౌక్, చాకలి ఐలమ్మ చౌక్, అంబేద్క ర్ చౌక్, గాంధీ చౌక్‌ల మీదుగా తన నివాసానికి చేరుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, కొండా శంకర్, తగ రం శంకర్‌లాల్, ఆరెపల్లి కుమార్, సీపతి బాన య్య, కర్రు శ్రీనివాస్, ఖలీల్‌ఖాన్, బడికెల శ్రీనివాస్, బత్తుల సత్యనారాయణ, మబ్బు నాగరా జు, పోలు కనుకరాజుతోపాటు నియోజకవర్గంలో ని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముత్తారం మండలకేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ తాటిపాముల వకుళారాణితో సహా 200ల మంది నాయకులు సోమవారం రాత్రి పుట్ట మధు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంథనిలోని పుట్ట మధు నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన తాటిపాముల శంకర్, కళ్యాణం రాయమల్లు, అడిచర్ల రాజు, శ్రీమర్తి శ్యామ్, అర్షనపెల్లి రాజు, తాడవేన శంకర్, ఇనుముల మహేశ్, అయిత కనుకయ్యతో పాటు పలువురికి పుట్ట మధు టీఆర్‌ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. కార్యక్రమంలో ముత్తారం ఎంపీపీ అత్తె చంద్రమౌళి, టీఆర్‌ఎస్ ముత్తారం మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, నాయకులు నాగినేని వెంకట్రావ్, నాంసాని సమ్మయ్య, శ్రీనివాస్, సంజీవరెడ్డి, పెయ్యల కుమార్, నూనె కుమార్, మహేందర్, చెలుకల అశోక్, మల్యాల రాజయ్య, రవీందర్‌రావు, రమణారెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.

సెంటినరీకాలనీలో..
రామగిరి: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు మంగళవారం సెంటినరీకాలనీ టీబీజీకేస్, టీఆర్‌ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుట్ట మధును గజమాలతో సత్కరించారు. కార్యక్రమం లో టీబీజీకేస్ నాయకులు నాగెల్లి సాంబయ్య, బత్తుల రమేశ్, ఇసంపల్లి రమేశ్, టీఆర్‌ఎస్ నాయకులు పూదరి సత్యనారాయణ, మైదం వరప్రసాద్, ఆసం తిరుపతి, పుల్లెల కిరణ్, బేతు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...