అధికారులు అప్రమత్తంగా ఉండాలి


Wed,April 17, 2019 01:59 AM

కలెక్టరేట్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 13 మండలాల్లో గల 13 జడ్పీటీసీ స్థానాలు 138 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలి పారు. జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం 14 రిటర్నింగ్ అధికారులను, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు 58 మంది రిటర్నింగ్ అధికారులను, 58 సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించామన్నారు. రిటర్నింగ్ అధికారులంతా ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ నెల 20 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని, ఆ వె ను వెంటనే మొదటి దఫా ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఉం టుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 263 గ్రామాల్ల్లో 744 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, 3,75,050 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు.

మొదటి దశలో ఏడు మండలాల్లోని 69 ఎంపీటీసీ స్థానాలు, 7 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయనీ, మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, అంతర్గాం, పాలకుర్తి, ధర్మా రం మండలాల్లో మొ దటి దశ ఎన్నికలు నిర్వహిస్తామని వివరిం చారు. రెండో దశలో ఆరు మండలాల్లో 69 ఎంపీటీసీ స్థానాలు, 6 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయనీ, ఈ దశలో పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నా రు. మే 6న మొదటి దశ ఎన్నికలకు పోలింగ్ ఉంటుందని, మే 10న రెండో దశ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 13 డిస్టిబ్యూషన్ కేంద్రా లు, 13 కౌంటింగ్ కేంద్రాలు, 13 స్ట్రాంగ్ రూమ్‌లను గుర్తించామన్నారు. జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు రూ.5వేలు, ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు రూ.2500 చొప్పున డిపాజిట్ సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణ సాయంత్రం 5గంటల వరకు మాత్రమే ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సామాగ్రిని ఈ నెల 25లోగా సమకూర్చుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా లైజన్ అధికారి వినోద్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్, ఇన్‌చార్జి జిల్లా సంక్షేమాధికారి, జిల్లా సహకారాధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి, డీఈఓ వెంకటేశ్వర్‌రావు, పెద్దపల్లి ఎంపీడీవో ఎం రాజు, నోడల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...