సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు


Tue,March 26, 2019 01:26 AM

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : ఏప్రిల్ 1న గోదావరిఖనిలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభ కోసం ముమ్మర ఏర్పాట్లు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సీఎం సభా ఏర్పాట్లను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సభా స్థలంలో నాలుగు దారులు ఉండాలనీ, ఎక్స్‌కవేటర్ సాయంతో మైదానాన్ని చదును చేయించాని సూచించారు. సామన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు వేయాలని చెప్పారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి తరలివచ్చేవారి కోసం సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రి వెంట పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, మారుతి, అభిషేక్ రావు, దీటి బాలరాజు, రామస్వామి, మైసయ్య, వీరస్వామి, వినయ్, పిల్లి రమేశ్ తదితరులున్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...