29,83,703


Tue,March 26, 2019 01:26 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య తేలింది. మొత్తంగా 29,83,703 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 14,72, 396 మంది పురుషులు, 15,11,224 మహిళలు, 83 మంది ఇతరులు ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాలు వయసు ఉన్న ఓటర్లు 72,070 మంది ఓటరు జాబితాలో నమోదయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ చివరి అవకాశంగా ఈ నెల 15 వరకు గడువు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం తుది జాబితా ప్రకటించింది. ప్రస్తుత జాబితాలో నమోదై ఉన్న వారికే ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాగా, కరీంనగర్ పార్లమెంట్‌లో 8,15,230 మంది పురుషులు, 8,35,629 మంది మహిళలు, 34 మంది ఇతరుల చొప్పున 16,50,893 మంది ఓటర్లు ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల పరిధిలో 8,88,063 మంది, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో 4,44,747 మంది ఓటర్లుగా నమోదయ్యారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...