లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు


Mon,March 25, 2019 01:54 AM

రామగిరి: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పా ట్లు చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీ దేవసేన స్పష్టం చేశారు. ఆదివారం మంథని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేయనున్న పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏడు సెగ్మెంట్లకు సంబంధించిన పోలింగ్ అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణ గురించి దిశానిర్దేశం చేశారు. అనంతరం కళాశాలలోని కౌంటింగ్ కేంద్రమైన అకాడమిక్ బ్లాక్-2 భవన సముదాయలను పరిశీలించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను భద్రపర్చేందుకు స్ట్రాంగ్ రూమ్‌ను ఏర్పాటు చేయాలనీ అధికారులకు సూచించారు. అలాగే మే-23న జరిగే కౌంటింగ్ కోసం ఎన్నికల సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించాలని, తాగునీరుతోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలనీ ఆదేశించారు.

కౌంటింగ్ నిర్వహణ కోసం పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే నిరంతర నిఘాకు డ్బ్బై సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్‌కు సంబంధించిన ఎన్నికల నిర్వహణ అధికారులకు ఇప్పటికే శిక్షణ తరగతులతో అవగాహన కల్పించినట్లు చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 1,841 పోలింగ్ కేంద్రాలు ఉండగా 1,841 మంది పీఓలను, 5,523 మంది ఓపీఓలు, 550 మంది అత్యవసరం కోసం అదనంగా నియమించినట్లు పేర్కొన్నారు. ఇందులో పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 288, మంథని 288, రామగుండం 265, ధర్మపురి 269, చెన్నూర్ 225, మంచిర్యాల 283, బెల్లంపల్లి 223 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ రాహుల్ రాజు, జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో కే నర్సింహమూర్తి, మంథని ఆర్డీవో మంచు నగేశ్, ఏఆర్‌ఓలు కే సురేశ్(మంచిర్యాల), రాజేశ్వర్ (చెన్నూర్), భిక్షపతి (ధర్మపురి), మంచిర్యాల తహసీల్దార్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...