మంత్రి కొప్పులకు ఘన సన్మానం


Mon,March 25, 2019 01:54 AM

మంథని, నమస్తేతెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మంథనికి వచ్చిన సందర్భం గా ఆయనను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రికి భారీ గజమాలను వేసి, శాలువాలు, టోపీతో సత్కరించారు. పలువురు కొప్పులకు శుభాకాంక్షలు చెప్పారు.

వెంకటేశ్ నేతకు హారతి
తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ నేతకు మంథని మాజీ సర్పంచ్ పుట్ట శైలజ ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయతిలకం దిద్ది భారీ మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఆయన చేతికి విజయ కంకణాన్ని కట్టారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...