అధినేత వస్తున్నరు..


Sun,March 24, 2019 01:19 AM

- వచ్చే నెల ఒకటిన పెద్దపల్లి జిల్లాకు కేసీఆర్
- రామగుండంలో నిర్వహించే పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార సభకు రాక

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శంఖారావం పూరించారు. ఈ నెల 21న ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన అధినేత, ఈ నెల 29 నుంచి మలి విడత ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల ఒకటిన పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకాబోతున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు మధ్య ఉన్న రామగుండంలోనే సభ నిర్వహణకు అనువుగా ఉంటుందని భావించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ నిర్వహించనుండగా, రామగుండంలో ఏ ప్రాంతంలో సభ నిర్వహిస్తారనే విషయం మాత్రం ఇంకా ఖరారుకాలేదు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...