అంకితభావంతో పని చేయాలి


Sun,March 24, 2019 01:19 AM

ధర్మారం : పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్ విజయానికి పార్టీ శ్రేణులు అంకితభావంతో పని చేయాలని రాష్ట్ర సంక్షేమ మంత్రి, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కొప్పుల ఈశ్వర్ సూచించారు. కరీంనగర్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ధర్మారం మండలానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి ఈశ్వర్ శనివారం ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వెంకటేశ్ నేతకాని పేరు ఖరారైన నేపథ్యంలో సమయం వృథా చేయకుండా ఆయ న గెలుపు కోసం అందరూ సమష్టిగా శ్రమించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లోని పార్టీ బూతు కమిటీలను తక్షణమే ఏర్పాటు చేసుకుని ప్రచారంలో ముందుకు వెళ్లటానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎంపీ అభ్యర్థి వెంకటేశ్ నేతకాని పెద్దపల్లిలో సోమవారం నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయనున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం గ్రా మాల్లో ముఖ్య నాయకులు కలసి ఒక ఉద్యమ తరహాలో ప్రచారం చేసి అభ్యర్థి విజ యం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఉందని వివరించారు. ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవనీ, శ్రమించిన వారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని మంత్రి ఈశ్వర్ గుర్తు చేశారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్‌రావు, నంది మేడారం సింగిల్ విండో చైర్మన్ పూస్కూరు నర్సింగారావు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ పెంచాల రాజేశం, మండల సభ్యుడు పాక వెంకటేశం, కొత్తూరు ఎంపీటీసీ సభ్యుడు తాళ్లపల్లి లింగయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ గూ డూరి లచ్చయ్య, నాయకులు పాకాల రాజయ్య, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, చింతల జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గెలిపించాలని ప్రచారం
కాల్వశ్రీరాంపూర్ : పెద్దపల్లి లోకసభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోర్లకుంట వెంకటేశ్‌ను గెలిపించాలని కోరుతూ టీఆర్‌ఎస్ నాయకులు మండలంలోని మొట్లపల్లిలో శనివారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు తులా మనోహర్‌రావు మాట్లాడుతూ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచన మేరకు గ్రామంలో ప్రచారం చేస్తు న్నట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి, కారు గుర్తుకు ఓటేసి పెద్దపల్లి ఎంపీ అభ్యర్తిగా పోటీ చేస్తున్న వెంకటేశ్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ర్టాభివృద్ధి కోసం కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు వస్తాయని, రాష్ట్రం సస్య శ్యామలం అవుతుందని ఓటర్లకు వివరించారు. తామంతా టీఆర్‌ఎస్ అభ్యర్థికే ఓటేస్తామని ప్రజలు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సీపతి రాజ్‌కుమార్‌గౌడ్, వార్డు సభ్యులు సముద్రాల రాజేశం, మోహన్, సరిత, ప్రేమలత, శంకరమ్మ, పోగుల రమేశ్, నాయకులు గాజుల రాజు, పందిల్ల మహేందర్, రాజ్ మహమ్మద్, చొప్పరి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ అభ్యర్థికి శుభాకాంక్షలు
ధర్మారం: పెద్దపల్లి లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకటేశ్ నేతకానికి టీఆర్‌ఎస్ మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన కరీంనగర్‌లో రాష్ట్ర సంక్షేమ మం త్రి కొప్పుల ఈశ్వర్ ఇంటికి వచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన మండల పార్టీ నాయకులు వెంకటేశ్ నేతకానిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తామంతా కలిసి లోక్‌సభ ఎన్నికల్లో విస్త్రత ప్రచారం చేసి గెలుపు కోసం కృషి చేస్తామని వెంకటేశ్‌కు వారు హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థిని కలిసిన వారిలో మండల పార్టి నేతలు పూస్కూరు జితేందర్‌రావు, తాళ్లపల్లి లింగయ్య, ముత్యాల బలరాంరెడ్డి, పెంచాల రాజేశం, పాకాల రాజయ్య తదితరులున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...