సదరమ్ శిబిరానికి స్పందన


Sun,March 24, 2019 01:19 AM

కలెక్టరేట్: జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన సదరమ్ శిబిరానికి స్పందన వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక అసహాయులకు అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆసరా పథకం పేరుతో పింఛన్లు అందించేందుకు శ్రీకా రం చుట్టింది. ఇందుకోసం అర్హులను ఎంపిక చేసేందుకు దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సదరమ్ శిబిరాలను నిర్వహి స్తుంది. ఈ క్రమంలోనే గతంలో నెలలో మూడో శనివారం నిర్వహించే శిబిరాల్లో దివ్యాంగుల అవస్థలను గమనించిన కలెక్టర్ శ్రీదేవసేన మార్చిలో సెలవు రోజులు తప్ప అన్ని శనివారాలు సదరమ్ శిబిరం నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేర కు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కలెక్టర్ సదరమ్ శిబిరం నిర్వహిం చేందుకు అధికారులను ఆదేశించడంతో దివ్యాంగులకు పింఛ న్లు అందించేందుకు అర్హులను గుర్తించడం కోసం వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అంతర్గాం, పాలకుర్తి మండలాలతో పాటు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని దివ్యాంగులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన శిబిరంలో సంబంధిత వైద్యులు పరీక్షలు నిర్వహించారు. దివ్యాంగులకు నిర్వహించిన ఈ శిబిరంలో ఎముకలకు సంబంధించి 233 మందికి, కంటి చూపునకు సంబంధించి 49 మందికి, చెవుడు మూగకు సంబంధించి 69 మందికి, మానసిక రుగ్మతలకు సంబంధించి 31 మంది చొప్పున మొత్తం మందికి సంబంధిత డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు రమాకాంత్, పురుషోత్తం, లక్ష్మీప్రసన్న, శశిధర్ శిబిరానికి హాజరైన దివ్యాంగులకు పరీక్షలు చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో ఏపీఎంలు రమాదేవి, నర్సమ్మ, అంజి, లక్ష్మణ్, సామంత్‌తో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన సీసీలు, మెప్మా ఆర్పీలు దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...