సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..


Sun,March 24, 2019 01:18 AM

పెద్దపల్లిటౌన్: తమ సామాజిక వర్గానికి చెందిన బొర్లకుంట వెంకటేశ్‌నేతకానికి పెద్దపల్లి లోక్‌సభ టికెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నేతకాని సామాజిక వర్గం ఆజన్మాంతం రుణపడి ఉంటుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గొళ్లె రాజ్‌కుమార్ పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్‌కుమార్ మాట్లాడుతూ, 70 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ నేతకాని సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణ మొత్తం తిరిగి వివిధ సామాజిక వర్గాల స్థితి గతులు పరిశీలించారని వివరించారు. ఆ నేపథ్యంలోనే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న నేతకాని సామాజిక వర్గాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు ఐదేళ్లుగా ముఖ్య మంత్రి కేసీఆర్ తీవ్ర కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో పెద్దపల్లి లోక్‌సభ సీటు వెంకటేశ్‌నేతకానికి ఇచ్చి మరోసారి బడుగు, బలహీన వర్గాల పక్షపాతి అని కేసీఆర్ రుజువు చేశారని వివరించారు. రానున్న రోజుల్లో నేతకాని సామాజికవర్గం కేసీఆర్ వెంటే ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడ నేతకాని సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి దుర్గం విశ్వనాథ్, నాయకులు చీమల కనుకయ్య, పామిని మల్లేశ్, మాట మల్లేశ్, జాడి లోకేశ్, దుర్గం జగన్, ముంజం నర్సయ్య, దుర్గం రామకృష్ణ, శివలింగయ్య తదితరులున్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...