టీఆర్‌ఎస్ నాయకుల సంబురాలు


Sat,March 23, 2019 01:34 AM

కమాన్‌పూర్ : పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేతను నియమించడంపై టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై టీఆర్‌ఎస్ నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులంతా క్రమశిక్షణతో పార్టీ అప్పగించే బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటివారిపైనైనా అధిష్ఠానం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తిని గెలిపించడం కోసం కృషి చేయాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటరీ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా వెంకటేష్ నేత పేరును టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఖరారు చేసిందన్నారు. ఆయన గెలుపు కోసం ఇక నుంచి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలశాఖ అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, ఎంపీపీ ఇనగంటి ప్రేమలత, వైస్ ఎంపీపీ కొట్టె భూమయ్య, నాయకులు ఇనగంటి రామారావు, బొల్లపెల్లి శంకర్‌గౌడ్, తాటికొండ శంకర్, పొనగంటి కనకయ్య, పల్లె నారాయణ, ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, కలీమోద్దీన్, గాదె సదయ్య, గొడిసెల స్వామి, బండి మల్లేశ్, జాబు సతీశ్, కందుల మధు, ఆడెపు రాజేశ్, బొంద్యాలు, కుమార్, స్వామి స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...