ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టితో ముందుకెళ్లాలి


Sat,March 23, 2019 01:34 AM

యైటింక్లయిన్ కాలనీ : వార్షిక లక్ష్య సాధనకు మరో తొమ్మిది రోజుల గడువు మాత్రమే ఉన్నందున లక్ష్య సాధన దిశగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని సంస్థ డైరెక్టర్ ఈ అండ్ ఎం శంకర్, డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేఖర్ ఆర్జీ-2 ఏరియా అధికారులకు సూచించారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో శుక్రవారం జీఎం, ఉన్నతాధికారులతో డైరెక్టర్లు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్షిక లక్ష్య సాధనలో భాగంగా లక్ష్యంతో కూడిన ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. అంతేగాక యంత్రాల పనితీరు, పని స్థలాల పెంపు అంశాలపై సూచనలు చేశారు. ముఖ్యంగా ఉత్పత్తి చేసిన బొగ్గును వినియోగదారులకు సకాలంలో సరఫరా చేయడంలో భాగంగా సీహెచ్‌పీకి కావాల్సిన యంత్రాలు, సామగ్రి, విద్యుత్ సరఫరా, సీహెచ్‌పీ సివిల్ వర్క్స్, ఉద్యోగుల క్వార్టర్లు తదితర సమస్యలపై చర్చించారు. ఇందులో ఎస్‌ఓటూ జీఎం కే.రవీందర్, ఓసీపీ-3 పీఓ బండి వెంకటయ్య, డీజీఎం పర్సనల్ వెంకటేశ్వరరావు, డీజీఎం సివిల్ రామకృష్ణ, పీఈ దుర్గాప్రసాద్, డీజీఎం ఎర్రన్న, సీహెచ్‌పీ ఎస్‌ఈ సదానందం, అధికారులు రాజేశ్వరి పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...