అంగన్‌వాడీల్లో ముగిసిన పోషణ్ అభియాన్


Sat,March 23, 2019 01:34 AM

మంథని, నమస్తేతెలంగాణ : అంగన్‌వాడీ కేంద్రాలను లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంథని సీడీపీఓ పద్మశ్రీ అన్నా రు. శుక్రవారం మంథని పట్టణంలోని మంథ ని-3, 6, 7 అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్ పక్షోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతాలను నిర్వహించారు. అదే విధంగా కిశోర బాలికలకు రక్తపరీక్షలు నిర్వహించి రక్త హీనత కలిగిన వారికి ఐరన్ మాత్రలు, కాల్షియం మాత్రలను పంపిణీ చేశారు. సీడీపీఓ పద్మశ్రీ మాట్లాడుతూ.. ప్రభుత్వం గర్భిణులు, పిల్లలకు ప్రతీ అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పోషక ఆహారాలను అందిస్తున్నదన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు సుగుణ, పా ర్వతి, రమ, పాల్గొన్నారు.
కమాన్‌పూర్ : మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈనెల 8 నుంచి ప్రారంభమైన పోషణ్ అభియాన్ పక్షోత్సవాల కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు కార్యక్రమంలో భాగంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సామూహిక అన్నప్రాసన, సామూహిక అక్షరభ్యాసం, గర్భిణులకు సీమాంతం నిర్వహించారు. కమాన్‌పూర్-2 అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్ భాగ్య చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించగా, పెంచికల్‌పేటలోని అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారులకు హనుమాన్ ఆలయంలో సామూహిక అన్నప్రాసనతోపాటు అక్షరభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండ వెంకటేష్ పాల్గొన్నారు.

రామగిరి : ఐసీడీఎస్ రామగిరి సెక్టార్ ఆధ్వర్యంలో శుక్రవారం పన్నూర్ గ్రామంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. బాలింతలు, గర్భిణులు, కిశోర బాలికలు తీసుకోవల్సిన పోషకాహారాన్ని వివరించారు. మంథని ఐసీడీసీ సీడీపీవో పద్మశ్రీ, సూపర్‌వైజర్ లక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు ఎ సరోజనదేవి, రమ, స్వరూప, అనసూర్య, రజిత, శ్యామల, సుగుణబాయి, మంజుల, లలిత, రుక్కమ్మ, సరస్వతి, జ్యోతి, శిరీష, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...