పోలింగ్‌కు సర్వం సిద్ధం


Fri,March 22, 2019 02:51 AM

-నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు..
-ఉదయం 8నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్
-ఏర్పాట్లను పర్యవేక్షించిన తహసీల్దార్లు
-పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సిబ్బంది
కాల్వశ్రీరాంపూర్: మండల కేంద్రంలో శుక్రవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ డిండిగాల రవీందర్ తెలిపారు. కాల్వశ్రీరాంపూర్ పోలింగ్ కేంద్రంలో మొత్తం 700 ఓట్లు ఉండగా అందులో 665 మంది పట్టభద్రులు కాగా, 35 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినిమోగించుకోనున్నారనీ, ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. కాగా కాల్వశ్రీరాంపూర్ పోలింగ్ కేంద్రాన్ని తహసీల్దార్ రవీందర్‌తోపాటు, ఎస్‌ఐ షేక్ మస్తాన్ సిబ్బందితో పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.
జూలపల్లి: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం స్థానం ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి గురువారం సామాగ్రితో అధికారులు చేరుకుని ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి పీఓ, ఏపీఓ, నలుగురు ఓపీఓలను నియమించారు. మండలవ్యాప్తంగా 503 మంది పట్టభద్రులు, 27 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ జరగనున్నది. తహసీల్దార్ రమేశ్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 328 మంది ఓటు హక్కు సద్వినియోగం చేసుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏలాంటి అవాంఛనీయమైన సంఘటనలు తలెత్తకుండా 144 సెక్షన్ అమలు చేశారు. ఇక్కడ పీఓ తిరుపతి, వీఆర్‌ఓ కిషన్, కానిస్టేబుల్ అనిల్‌కుమార్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

ధర్మారం: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ధర్మారం మండలకేంద్రంలో తహసీల్దార్ సంపత్ ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలో ఉపాధ్యాయ ఓటర్లు 20 మంది, పట్టభధ్రుల ఓటర్లు 711 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఇక్కడ ఒక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయగా, ఒక పీఓ, ఒక ఏపీఓ, మరో నలుగురు సిబ్బందిని పోలింగ్ కోసం కేటాయించారు. కాగా సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పోలింగ్ ఉదయం 8నుంచి సాయంత్రం 4 గంటల జరుగుతుందనీ, పోలింగ్‌ను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలించేందుకు గాను వెబ్‌కాస్టింగ్ సిస్టంను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ సంపత్ నమస్తే తెలంగాణకు తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...