ముగిసిన వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు


Fri,March 22, 2019 02:50 AM

యైటింక్లయిన్‌కాలనీ: పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాయలంలో గురువారం బ్రహ్మోత్సవాలు ముగిశాయి. మార్చి 16 నుంచి 21 వరకు ఆలయ ప్రధాన అర్చకుడు గోవర్దనగిరి జగాన్నాథాచార్యులు, మధుసూదనచార్యులు, లక్ష్మణాచార్యుల ఆధ్వర్యంలో బ్రహ్మత్సోవాలు ఆలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. చివరిరోజు ఆలయంలో పూర్ణాహుతితో పూజలు ప్రారంభమై నాగబలి, పుష్పయాగంతోపాటు రాత్రి ఏకాంత సేవతో బ్రహ్మత్సోవాలు ముగిశాయి. చివరిరోజు జరిగిన వేడుకల్లో ఆర్జీ-2 జీఎం కల్వల నారాయణ దంపతులు, ఎస్‌ఓటుజీఎం కొండమీది రవీందర్ దంపతులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం రాత్రి స్వామి వారి రథోత్సవం కాలనీ పురవీధుల గుండా కొనసాగింది. ఈ రథోత్సవం సందర్భంగా కోలాట బృందాలు నృత్యాలు చేస్తూ స్వామివారికి ఘన స్వాగతం పలికారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...