ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


Fri,March 22, 2019 02:50 AM

కలెక్టరేట్: ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8నుంచి సాయంత్రం 4 గంటల వరకు పో లింగ్ జరగనుంది. ఇందులో పట్టభద్రులు ఓటు హ క్కు వినియోగించుకునేందుకు 26 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 11 కేంద్రాల చొప్పున మొత్తం 37 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల పోలింగ్ కోసం 60 మంది సిబ్బందిని పీవోలు, ఓపీవోలుగా నియమించగా, ఉపాధ్యాయుల పోలింగ్ కోసం 55 మంది సిబ్బందిని పీవోలు, ఓపీవోలుగా మొత్తం 115 మంది ని నియమించారు. వీరితోపాటు 21 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం జిల్లాలోని 26 పోలింగ్ కేంద్రాల్లో 16,386 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇందులో 11,170 మంది పురుష ఓటర్లు కాగా, 5,214 మంది మహిళా ఓటర్లు, ఇద్దరు మూడో రకానికి చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 11 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 935 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయ ఆవరణలో గురువారం ఎన్నికల నిర్వహణ సామాగ్రిని పెద్దపల్లి ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబంధిత సిబ్బందికి అందజేసి పోలింగ్ కేంద్రాలకు పంపించారు.

పోలింగ్‌కు భారీ బందోబస్తు
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పెద్దపల్లి జోన్ డీసీపీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం పెద్దపల్లి, రామగుండం ఏపీసీలు వెంకటరమణారెడ్డి, ఉమేందర్‌లు నోడల్ ఆఫీసర్లుగా, ఐదుగురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు రూట్ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. జిల్లాలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేశామని పెద్దపల్లి జోన్ డీసీపీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. ప్రత్యేకంగా నియమించిన నోడల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లతో పాటు మరో 20 మంది ఎస్‌ఐలు, 200 మంది వరకు పోలీసులు బందోబస్తు చర్యలు చేపడుతారని డీసీపీ సుదర్శన్‌గౌడ్ వెల్లడించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...