ఘనంగా పాఠశాల వార్షికోత్సవం


Fri,March 22, 2019 02:49 AM

ధర్మారం: ధర్మారం మండలకేంద్రంలోని సాయి మణికంఠ పాఠశాల 16వ వార్షికోత్సవం బుధవా రం రాత్రి ఘనంగా జరిగింది. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కా ర్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్నే హలత మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని అన్నారు. ఉన్న త చదువులు చదవడానికి తల్లిదండ్రులు సహకరించాలని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ జైన సురేశ్ అధ్యక్షత వహించగా, ఎస్‌ఐ కోడి ప్రేమ్ కుమార్, పాఠశాల ఎండీ జైన రమాదేవి, గ్రామ సర్పంచ్ పూస్కూరు జితేందర్‌రావు, ఎంపీటీసీ బొల్లి స్వామి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...