విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి


Fri,March 22, 2019 02:49 AM

-డీఈఓ వెంకటేశ్వర్‌రావు
కలెక్టరేట్: విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసంతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందనీ, తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్‌రావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల దర్గా ప్రభుత్వ పాఠశాలలో బుధవారం రాత్రి వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతి సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సమావేశంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం వేణు మనోహర్, పాఠశాల హెచ్‌ఎం జానకిదేవి, పాఠశాల భూదాత ఎరబాటి వెంకటేశ్వర్‌రావు, లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గుండ స్వప్న, సీఆర్‌పీ శ్రీలత, ఉపాధ్యాయులు సరళ, శోభ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...