నూతన కార్యవర్గం ఎన్నిక


Fri,March 22, 2019 02:49 AM

ధర్మారం: ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో గురువారం మాల మహానాడు మహిళా విభాగం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం మండలాధ్యక్షురాలు దేవి లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ అధ్యక్షురాలిగా పెర్క లక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా సొల్లు సునీతతో పాటు పలువురిని సభ్యులుగా నియమించినట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో మాల మహానాడు మండల యూత్ విభాగం అధ్యక్షుడు మేదరి వెంకటేశ్, మహిళలు సొల్లు విజయ, సూర రజిత, శారద, దేవమ్మ, అరుణ, శాంత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...