మామిండ్ల, పాతూరిని గెలిపించండి


Thu,March 21, 2019 12:58 AM

- టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓటు వేయండి
- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
- సుల్తానాబాద్, జిల్లా కేంద్రంలో పట్టభద్రులతో సమావేశం

కలెక్టరేట్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్(పట్టభద్రుల), పాతూరి సుధాకర్‌రెడ్డి(ఉపాధ్యాయ)లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపు నిచ్చారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్‌లో బుధవారం పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల పట్టభద్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవడానికి విద్యావంతులు, మేధావులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బంగారు తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉండేందుకు టీఆర్‌ఎస్ బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డిల గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కేక్ కట్ చేయగా, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎలువాక రాజయ్య, టీఎన్జీవోఎస్ మాజీ రాష్ట్ర నాయకుడు ఎంఏ హమీద్, నాయకులు కొయ్యడ సతీశ్‌గౌడ్, మర్కు లక్ష్మణ్, ఎరుకల రమేశ్, మేకల కుమార్ యాదవ్, నూనేటి కుమార్ యాదవ్, కొండి సతీశ్, గాండ్ల సతీశ్, పుట్ట కార్తీక్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ భృతి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
సుల్తానాబాద్: పట్టభధ్రులకు నిరుద్యోగ భృతి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ శ్రేణులతో బుధవారం ఆయన సుల్తానాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏ ఎన్నికలైన టీఆర్‌ఎస్ ప్రతిపాదించిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపు నిచ్చారు. తాత్కాలికంగా కాకుండా, శాశ్వత లబ్ధి కోసం పట్టభద్రులు ఆలోచించాలని కోరారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనీ, అత్యధిక మెజార్టీ వచ్చేలా టీఆర్‌ఎస్ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎన్నికల బాధ్యుడు, టీఎన్‌జీవోస్ మాజీ రాష్ట్ర నాయకుడు హమీద్ మాట్లాడుతూ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవ చేయడానికి వచ్చిన చంద్రశేఖర్ గౌడ్‌కు మద్దతు తెలిపి, గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బాలాజీరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు పాల రామారావు, బుర్ర శ్రీనివాస్‌గౌడ్, శ్రీగిరి శ్రీనివాస్, కాంపెల్లి నారాయణ, పురం ప్రేమ్‌చందర్‌రావు, తిప్పారపు దయాకర్, పడాల అజయ్‌గౌడ్, వీరగోని రమేశ్‌గౌడ్, మొలుగూరి అంజయ్యగౌడ్, సూరశ్యాం, ముత్యం రమేశ్, మైలారం నారాయణ, జవ్వాజి రాజేశ్, డాక్టర్ కలీం, బండి సంపత్, తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...