బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం


Thu,March 21, 2019 12:57 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ : ధర్మపురిలో లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం లక్ష్మీనృసింహస్వామి (యోగ) తెప్పొత్సవం, డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను బ్రహ్మపుష్కరిణి (కోనేరు) వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి అందంగా అలంకరించిన హంస వాహనంలో ఉంచి కోనేరులో ఐదు ప్రదక్షిణలు చేశారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ బుకాగులాలు, పసుపు, కుంకుమ చల్లారు. అ నంతరం కోనేరు మధ్యలో గల మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి వేదపండితులు డోలోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమం రాత్రి 9 గంటల వరకు కొనసాగగా, భక్తులు క్యూలైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నిర్మల్, నిజామాబాద్ నుంచి వచ్చిన భక్తుల భజన పాటలు, ధర్మపురికి చెందిన మహిళల కోలాట, నృత్య ప్రదర్శనలు, రాత్రి వేళలో భక్తుల కాలక్షేపం కోసం శేషప్ప కళావేదికపై నిర్వహించిన సాంసృ్కతిక కార్యక్రమాలు అలరించాయి. పాత టీటీడీ కల్యాణ మండపంలో ఆలయం పక్షాన సుమారు 8 వేల మందికి అన్నదానం చేశారు. భక్తులకు పట్టణంలోని వివిధ పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సేవలందించారు.

ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో సందడి నెలకొంది. గోదావరిలోకి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానాలు ఆచరించారు. యజ్ఞాచార్యులు కందాళై పురుషోత్తమాచార్యులు ఆధ్వర్యంలో ఆస్థాన సామ వేదపండితుడు ముత్యాల శర్మ వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య హోమం నిర్వహించారు. డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో సీఐ లక్ష్మీబాబు, ఎస్‌ఐ శ్రీకాంత్, 200 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, డీసీ, ఈఓ అమరేందర్, ధర్మకర్తలు అక్కనపల్లి సునీల్, ఇనుగంటి వెంకటేశ్వర్‌రావు, మురికి భాగ్యలక్ష్మి, సాయిని శ్రీనివాస్, మామిడి లింగన్న, జెట్టి రాజన్న, దోమకొండ తిరుపతి, జోగినపల్లి రమాదేవి పాల్గొన్నారు. కాగా ఉత్సవాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం 3గంటలకు కోనేరులో లక్ష్మీ నృసింహ స్వామి (ఉగ్ర) తెప్పొత్సవం, డోలోత్సవం నిర్వహిస్తామని ఆలయ చైర్మన్, ఈఓ తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...