ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య


Thu,March 21, 2019 12:57 AM

పాలకుర్తి : పాలకుర్తి మండలం జీడీనగర్ గ్రామానికి చెందిన దండుగుల సంపత్(35) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుఉకని ఆత్మహత్యచేసుకున్నాడు. బసంత్‌నగర్ ఎస్‌ఐ ఉమాసాగర్ కథనం ప్రకారం, సంపత్ కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ. 80 వేలు అప్పుచేశాడు. భార్య సమ్మక్కతో కలిసి కూలి పనిచేసుకుని సంపత్ అప్పులబాధ ఎక్కువైంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తిచెంది, రేకులషెడ్డుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. భార్య సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

చిరు వ్యాపారి..
ఫెర్టిలైజర్‌సిటీ : నగరంలోని మల్లికార్జున్‌నగర్‌కు చెందిన రేణికుంట్ల సతీశ్ (32) అనే చిరు వ్యాపారి ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్ టౌన్ ఎస్‌ఐ సుమన్ రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, మల్లికార్జున్‌నగర్‌కు చెందిన సతీశ్ స్థానిక కూరగాయల మార్కెట్‌లో అల్లం, వెల్లుల్లి చిరు వ్యాపారం నిర్వహిస్తాడు. కొంత కాలంగా వ్యాపారంలో నష్టం రాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి 8 నెలల క్రితమే మహారాష్ట్రలోని సిరివంచకు చెందిన మానసతో వివాహం కాగా, భార్య పుట్టింటికి వెళ్లింది. అయితే, మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...