ప్రజా సమస్యలపై స్పందించాలి


Thu,March 21, 2019 12:57 AM

కలెక్టరేట్: ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పం దిస్తూ ప్రభుత్వ పథకాలను అర్హులకు దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని పెద్దపల్లి ఎంపీపీ సందనవేని సునీత పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు పలు ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎంపీపీ సంబంధిత అధికారులు సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలన్నారు. బ్రాహ్మణపల్లి సర్పంచ్ గాండ్ల మల్లేశం గ్రామంలో ఏర్పాటు చేసిన అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రస్తుత పాఠశాల భవనంలోనే నడిపిస్తారా పక్కా భవనం నిర్మిస్తారా అని ప్రశ్నించడంతో ఎన్నికల కోడ్ అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. అలాగే స్థానిక పాఠశాలలో 7వ తరగతి దాకా మాత్రమే ఇంగ్లిషు విద్యా బోధన కొనసాగుతుందని వివరించారు. దానిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, ప్రజారోగ్య వ్యవస్థతో పాటు రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సమావేశంలో ఎలాంటి హామీలు కానీ తీర్మా ణాలు కానీ చేయడం వీలుకాకపోవడంతో ఎన్నికల అనంతరం వేసవిలో ఎదుర్కొ బోయే సమస్యలకు పరిష్కారం చూపవచ్చని ఎంపీపీతో పాటు అధికారులు సభ్యు లకు సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ రాజు, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ హరికృష్ణతో పాటు మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...