పేదలందరికీ ఉపాధి కల్పించాలి


Thu,March 21, 2019 12:57 AM

ఓదెల: గ్రామాల్లోని పేద ప్రజలందరికీ ఉపాధి హామీ పథకంలో పని కల్పించే బాధ్యత ఈజీఎస్ సిబ్బందిపైనే ఉందని డీఆర్‌డీఓ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఓదెల మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ సిబ్బందితో మండలంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులపై బుధవారం సమీక్షించారు. గ్రామాలవారిగా కొనసాగుతున్న ఈజీఎస్ పనుల వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్లను అడిగి తెల్సుకుని పలు సూచనలు చేశారు. పెట్టుకున్న లక్ష్యం ప్రకారం పని దినాలు పూర్తి చేయాలని ఆదేశించారు. మండలంలో ఆశించిన స్థాయిలో ఈజీఎస్ పనులు జరగడం లేదని అసంతృప్త్తి వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే క్షమించేది లేదని హెచ్చరించారు. అంతకు ముందు గుండ్లపల్లి, పిట్టల ఎల్లయ్య పల్లె, కనగర్తి, మడక గ్రామాల్లోని వన నర్సరీలను సందర్శించారు. నర్సరీల్లో మొక్కల పెంపకం తీరును పరిశీలించారు. హరితహారం విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్క రూ బాధ్యతగా పని చేయాలని కోరారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే మొక్కల ను పెంచుతున్నామని వివరించారు. అందరూ ఇండ్లల్లో మొక్కలను పెంచుకునేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్ పులుగు తిరుపతిరెడ్డి, కార్యదర్శి రాజేశం, ఏపీఓ కొమురయ్య, టెక్నికల్ అసిస్టెంట్ జనార్దన్, ఏపీఎం లతామంగేశ్వరి, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లయ్య, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...