మామిండ్లకే ఓటెయ్యండి


Wed,March 20, 2019 02:29 AM

-ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని,నమస్తే తెలంగాణ: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుందామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. మార్కండేయ కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉద్యోగ, ఉద్యమ, ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో ఉన్నతాధికారిగా, ఉద్యమకారుడిగా అనుభవం ఉండి, తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం వైస్ చైర్మన్‌గా, తెలంగాణ ఉద్యోగుల జేఏసీలో కూడా కొనసాగారన్నారు. ప్రశ్నించే గొంతు అని నినాదంతో ముందుకువస్తున్న కాంగ్రెస్‌కు ఇప్పటివరకు అభివృద్ధి గురించి తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారనీ, సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సైతం అడ్డుపడ్డారనీ, వారిని ప్రజలు ఎలా నమ్ముతారని విమర్శించారు. టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారు సైతం ఎమ్మెల్యేలు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఉపాధ్యాయ సంఘాలు బలపరుస్తున్న పాతూరి సుధాకర్‌రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతకుముందు ప్రచార పత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, తస్లీమ భాను, బిక్కినేని నర్సింగరావు, పాముకుంట్ల భాస్కర్, బక్కి కిషన్, అచ్చ వేణు, కోట రవి, నూతి తిరుపతి, దుర్గం రాజేశం, అడప శ్రీనివాస్, కృష్ణమూర్తి, సురేశ్, రవీందర్, పృథ్వీ, మేడం సతీశ్, గాజె సతీశ్, అంబటి సంతోష్, తోకల రమేశ్ తదితరులున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...