హరీశ్‌ను ఆదుకోరూ..


Wed,March 20, 2019 02:29 AM

కమాన్‌పూర్ : మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన ఇరుగురాల లక్ష్మి - పర్వతాలు కుమారుడైన ఇరుగురాల హరీశ్ (16) అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆపరేషన్ కోసం రూ.30 లక్షల దాకా ఖర్చవుతుందనీ, దాతలు ముందుకు వచ్చి సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. హరీశ్‌కు 2017లో తీవ్ర జ్వరం రాగా, కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి, హరీష్‌కు క్యాన్సర్ వ్యాధి సోకినట్లు గుర్తించారు. వెంటనే హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ దవాఖానలో చేర్చించగా, హరీశ్‌కు మైలోయిడ్ లుకేమియా అనే క్యాన్సర్ వ్యాధి వచ్చిందని నిర్ధారించారు. ఇక్కడ కొన్ని రోజులు కీమోథెరపీ చికిత్స అందించగా, వైద్యానికి ఖర్చులు ఎక్కువ కావడంతో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఎంఎన్‌జీ క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇక్కడ మరో నాలుగు నెలల పాటు కీమో థెరపీ చికిత్స అందించి, వ్యాధి తగ్గుముఖం పట్టడంతో 2018 ఫిబ్రవరిలో డిశ్చార్జీ చేశారు. మళ్లీ డిసెంబర్ 2018లో వైద్య పరీక్షల కోసం హరీశ్‌ను తీసుకెళ్లగా, జబ్బు తిరిగి వచ్చిందనీ హైడోస్ కీమోథెరపీ చికిత్స అవసరమని చెప్పి మళ్లీ దవాఖానలో చేర్చుకున్నారు. ప్రస్తుతం హరీశ్‌కు ఎముక మజ్జు కణాల మార్పిడి చేస్తే జబ్బు తిరిగి రాదనీ, ఈ చికిత్సకు సుమారు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. తమది రెక్కాడితే గాని, డొక్కాడని నిరుపేద కుటుంబమనీ, ఇప్పటికే అప్పులు తెచ్చి వైద్యం చేయిస్తున్నామని హరీశ్ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పుడు మళ్లీ రూ.30 లక్షలు ఎలా తెచ్చేదనీ, కొడుకు ప్రాణాలను ఎలా కాపాడుకునేదంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. దాతలు ముందుకొచ్చి సాయం చేస్తేనే త మ కొడుకు ప్రాణాలు నిలబడుతాయనీ, ఎవరైనా పెద్దమనసు చేసుకుని తమ కొడుకు వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...