రికార్డు


Wed,March 20, 2019 02:28 AM

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : బొగ్గు రవాణాలో సింగరేణి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారీగా నల్ల బంగారాన్ని ఉత్పత్తి చేస్తూనే.. మరోవైపు ఇప్పటికే పేరుకుపోయిన నిల్వలను తరలిస్తున్నది. సంస్థ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తితోపాటు రవాణాలోనూ దూకుడు పెంచింది. రెండింటా ప్రగతితో లాభాల పంట పండిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి 18 నాటికి 6,49,25,690 టన్నులు (64.92 మిలియన్ టన్నులు) రవాణా చేసినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదేసమయానికి సింగరేణిలో 6,18,05,191 టన్నులు (61.80 మిలియన్ టన్నులు) రవాణా చేశారు. గతేడాది కన్నా 31,20,499 టన్నుల బొగ్గును అదనంగా తరలించడం ఒక రికార్డుగా అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా సంస్థకు భారీ ఆదాయం లభించే వీలుందని చెబుతున్నారు. బొగ్గు ఉత్పత్తిలోనూ సింగరేణి సంస్థ దూకుడు పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి 18 నాటికి 6,16, 7,594 టన్నులు(61.67 మిలియన్ టన్నులు) బొగ్గును ఉత్పత్తి చేసింది. అంటే ఉత్పత్తి చేసిన బొగ్గుతోపాటు ఇప్పటికే నిల్వ ఉన్న 3.25 మిలియన్ టన్నుల బొగ్గు తరలించింది. ఎఠక్కువ రోజులు నిల్వ ఉండే బొగ్గు ఎండకాలంలో కాలిపోవడం, బూడిదగా మారడం వల్ల సంస్థకు భారీ నష్టం వాటిల్లేది. ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా రోజువారీగా ఉత్పత్తయ్యే బొగ్గుతోపాటు నిల్వల నుంచి కూడా రవాణా చేయడం విశేషం.

లక్ష్యాన్ని అధిగమించిన ఏరియాలు...
ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 13రోజుల గడువు ఉండగానే సంస్థలోని 11 ఏరియాల్లో ఇప్పటికే మూడు ఏరియాలు నిర్ధేశిత వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాయి. కొత్తగూడెం ఏరియా వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 1,07 ,69,800 ఉండగా, ఇప్పటికే 1,17,92,055 ట న్నులు (109శాతం) సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇల్లందు డివిజన్‌లో 56,77,400 టన్నుల వార్షిక లక్ష్యానికి గాను మార్చి 18 నాటికి 61,25,271 టన్నులు (108శాతం), శ్రీరాంపూర్ డివిజన్‌లో 51,68,560 టన్నుల లక్ష్యానికి గాను 52,24,431 టన్నులు (101శాతం) సాధిం చి వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. రామగుండం డివిజన్-1 కూడా ఈసారి లక్ష్య సాధన దిశగా పరుగులు పెడుతున్నది. మార్చి 18 నాటికి ఆర్జీ-1 ఏరియా 61,76,000 టన్నులకు గాను 58,87,765 టన్నులు (95శాతం) ఉత్పత్తి సాధించింది. రామగుండం డివిజన్-3లో 71,18,000 టన్నులకు గాను 66,10,144 ట న్నులు (93శాతం), రామగుండం డివిజన్-2లో 70,71,880 టన్నులకు గాను 63,66,844 టన్నులు(90శాతం) సాధ్యమైంది.

ఈ మూడు డివిజన్లలో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి అధికారులు, కార్మికులు నిరంతరం కృషి చేస్తున్నారు. సింగరేణివ్యాప్తంగా మిగతా ఏరియా ల్లో మణుగూరు 90 శాతం, బెల్లంపల్లి 89శాతం, అడ్రియాల ప్రాజెక్టు 73 శాతం, భూపాలపల్లి 63 శాతం, మందమర్రి 59శాతం బొగ్గు ఉత్పత్తి సాధి ంచాయి. ఆయా ఏరియాల్లో నిర్ధేశిత లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సింగరేణిలో మార్చి 18నాటికి 67.31మిలియన్ టన్నుల లక్ష్యానికిగాను 61.67 మిలియన్ టన్ను లు (92శాతం) సాధ్యమైంది. ఈసారి అంతర్గత లక్ష్యమైన 66 మిలియన్ టన్నులు సాధించేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తుండగా, 65 మిలియన్ టన్నులకు పైగానే బొగ్గు ఉత్పత్తి సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంస్థలో రాబోయే 13 రోజుల్లో ప్రతి గంట విలువైనదిగా భావించి, బొగ్గు ఉత్పత్తి చేయాలని ఉన్నతాధికారులు కోరుతున్నా రు. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నడిమెట్ల శ్రీధర్, ఉత్పత్తిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...