ప్రమాదవశాత్తు గీత కార్మికుడి మృతి


Wed,March 20, 2019 02:28 AM

ఓదెల : నాంసానిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు వీరగోని రాజయ్యగౌడ్(40) తాటిచెట్టు పై మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, రోజులాగే మంగళవారం సాయంత్రం రాజయ్యగౌడ్ తాటిచెట్లు ఎక్కడానికి ఇంట్లో నుంచి వెళ్లాడు. చీకటి పడే సమయం వరకు కూడా తిరిగి ఇంటికి రాకపోవడంతో అతని జాడ కోసం వెతికారు. ఈ క్రమంలో తాటిచెట్టు కింద పడి మృతి చెంది ఉన్నట్లు గమనించారు. కాగా, ఎలా కిందపడ్డాడో తెలియరాలేదు. అయితే, ఈ నెల 31న కూతురు వివాహం ఉంది. ఇంతలోనే రాజయ్యగౌడ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కూరుతు వివాహం చూడకుండానే తండ్రి మృతి చెందిన ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...