విశ్వబ్రాహ్మణుల ఐక్యతకు కృషి చేయాలి


Tue,March 19, 2019 03:10 AM

-సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నర్సింహాచారి
పెద్దపల్లిటౌన్: విశ్వబ్రాహ్మణుల్లో ఐక్యతకు సంఘ సభ్యులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధికార ప్రతినిధి పాలకోజు నర్సింహాచారి పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విశ్వబ్రాహ్మణ ఐక్యతా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా గర్రెపల్లి రాజుచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నర్సింహాచారి మాట్లా డుతూ, విశ్వబ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేం దుకు అందరూ సహకరించాలని కోరారు. వడ్రంగులపై అటవీశాఖ అధికారులు కేసులు పెడుతుండడంతో వారు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. విశ్వబ్రాహ్మణుల్లో ఉన్న వృత్తుల సమస్యలను ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపో వాల్సిన అవసరముందన్నారు. ఇక్కడ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు భీమోజు సురేందర్‌చారి, నవుడ్ల సంతోష్‌చారి, నాగులమల్యాల శివాచారి, మడుపు అంజయ్యచారి, వనపల్లి శ్రీనివాసాచారి, ధరణి భిక్షపతి, బొజ్జ వెంకన్న తదితరులున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...