పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం


Tue,March 19, 2019 03:10 AM

-కొలనూర్ పీహెచ్‌సీ డాక్టర్ దీప్తి
-కొనసాగుతున్న పోషణ్ అభియాన్
ఓదెల: పౌష్టికాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కొలనూర్ పీహెచ్‌సీ డాక్టర్ దీప్తి తెలిపారు. కొలనూర్ అంగన్‌వాడీ సెంటర్-4లో సోమవారం పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో దీప్తి మాట్లా డుతూ, గర్భిణులు అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే తల్లీ బిడ్డలకు శేష్టమని వివరించారు. గర్భిణులకు పలు ఆరోగ్య సూత్రాలను తెలిపారు. చిన్నారు లకు అన్నప్రాసనం, అక్షరాభ్యాసం చేశారు. బాలమృతం, కోడిగుడ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ షమీమ్, హెల్త్ సూపర్‌వైజర్ శంకర్, వైద్య సిబ్బంది శ్రీలత, అంగన్‌వాడీ టీచర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ యాదవ నగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం, పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభాస్యం చేయించారు. పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటామని అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్, జేడీఏ రాజన్న, గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సంపత్,ఐసీడీఎస్ సూపర్ వైజర్ సరళ ,అంగన్‌వాడీ కార్యకర్తలు అరుణ, నీరూప, శ్రీలత, మేఘమాల, అంజలి, సరోజన, సునీత, విమల, స్వాతి, హరిప్రియ, వినోద, విజయలక్ష్మి, ఎఎన్‌ఎం సరస్వతి, రమా, హెల్త్ సూపర్ వైజర్, ఆశా కార్యకర్తలు, తదితరులున్నారు.

కిశోర బాలికలకు
ధర్మారం : పోషకాహారంపై అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సోమవారం కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. ఈమేరకు నాలుగు కేంద్రాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు ఒకే కేంద్రంలో కార్యక్రమాన్ని చేపట్టి, బాలికలకు రోజూ పోషకాహారం తీసుకోవాలని సూచించారు. తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు తీసుకోవాలని వివరించారు. వాటిని నిత్యం తీసుకోవడంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు.కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఇన్‌చార్జి లక్షీ ప్రసన్న, అంగన్‌వాడి టీచర్లు దేవి కళావతి, చింతపండు భాగ్యలక్ష్మి, సుధారాణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

పోషకాహార ప్రదర్శన
నంది మేడారంలోని 2,5 అంగన్‌వాడీ కేంద్రాలకు చెంది న చిన్నారులతో పోషకాహార ప్రదర్శన నిర్వహించారు. కేం ద్రాలకు హాజరువుతున్న చిన్నారులు కూరగాయలు, పండ్ల తోరణాలను మెడలో వేసుకొని ప్రదర్శన చేశారు. చిన్నారుల ఈ ప్రదర్శన ఆకట్టుకుంది. చిన్నారులకు రోజూ ఇండ్లలో వారి తల్లిదండ్రులు అందించే పోషకాహారాన్ని కేంద్రంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆయా కేంద్రాల అంగన్‌వాడీ టీచర్లు బోగె శ్రీలత, చెనెల్లి కళ్యాణి తదితరులున్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...