ప్రచార ఖర్చుపై పక్కా నిఘా


Tue,March 19, 2019 03:09 AM

-అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి
-పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
-వ్యయ పరిశీలకుడు ముఖేశ్‌కుమార్
కలెక్టరేట్ : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ప్రచార ఖర్చుపైఐ పక్కా నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు ముఖేశ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులంతా అప్రమత్తతతో పనిచేయాలని చెప్పారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ శ్రీదేవసేనతోపాటు సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడంలో అధికారులు కీలకపాత్ర పోషించాలని చెప్పారు. పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న వారు రూ.70లక్షల దాకా ఖర్చు పెట్టుకోవచ్చుననీ, ఈ పరిమితిని మించి ఎక్కువగా డబ్బు ఖర్చు చేయకుండా గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. అభ్యర్థులు ప్రచారం సందర్భంగా చేసే ప్రతి ఖర్చు వివరాలను వీడియో సర్వేలెన్స్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు సేకరించాలన్నారు. అభ్యర్థుల కుటుంబీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఇతర విషయాలపై బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. సీ-విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారం చూపాలని సూచించారు. అనంతరం కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచార ఖర్చులపై నిఘాను ఉంచి రికార్డు చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి సీ-విజిల్ యాప్ ద్వారా, టోల్ ఫ్రీ నెంబర్ 1950 ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...