మహిళలు ఆర్థికంగా ముందుకుసాగాలి


Tue,March 19, 2019 03:09 AM

-ఆర్జీ-3 సేవా సమితి అధక్షురాలు వసంత
-కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాల సందర్శన
రామగిరి : మహిళలు స్వయం ఉపాధి మార్గాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ముందుకు సాగాలని ఆర్జీ - 3 సేవా సమితి అధక్షురాలు కే వసంత పిలుపునిచ్చారు. సేవా సమితి ఆధ్వర్యంలో లద్నాపూర్, పన్నూర్, రామయ్యపల్లి, రత్నాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ఆమె సోమవారం సందర్శించారు. సింగరేణి ప్రభావిత గ్రామాల్లోని యువతీయువకులు, మహిళలకు సేవా సమితి ద్వారా కుట్టు మిషన్, మగ్గం వర్క్స్, కంప్యూటర్, మోటర్ డ్రైవింగ్‌లో సింగరేణి సంస్థ శిక్షణ ఇప్పిస్తున్నదని తెలిపారు. ఇలాంటి శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అనంతరం రత్నాపూర్ గ్రామంలోని శిక్షణా కేంద్రంలో సర్పంచ్ పల్లె ప్రతిమ ఆధ్వర్యంలో సేవా సమితి అధ్యక్షురాలిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పీఓ కావూరి మారుతి, రామయ్యపల్లి సర్పంచ్ దేవునూరి రజిత, సేవా సమితి సభ్యులు భాగ్యలక్ష్మి, అరుణ, జ్యోతి, ఉమ, సప్న, పద్మ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...