ఎక్సైజ్ పోలీసుల దాడులు


Tue,March 19, 2019 03:08 AM

ముత్తారం : మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో ఎవరైనా నాటుసారా తయారు చేస్తే కేసులు తప్పవని మంథని ఎక్సైస్ సీఐ గురువయ్య హెచ్చరించారు. సోమవారం ఆయన ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామ శివారులోని నాటుసారా తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో కొన్నిరోజులుగా నాటు సారా తయారు చేస్తున్నారని అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి తనిఖీ చేసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన తుమ్మల ప్రభాకర్‌కు నాటు సారా తయారు చేస్తున్నట్లు గుర్తించి, బెల్లం పానకం ధ్వంసం చేయడంతోపాటు రెండు లీటర్ల నాటు సారాయిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభాకర్‌పై కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు. గ్రామాల్లో నాటుసారా తయారు చేసేవారు ప్రవర్తన మార్చుకోవాలనీ, లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్, అనిల్ పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...