ఓపెన్ బార్లు


Mon,March 18, 2019 12:48 AM

కాల్వశ్రీరాంపూర్ : మైదానప్రాంతాలే వేదికగా మందుబాబులు ఇష్టారాజ్యంగా తాగుతున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారుస్తూ బాటసారులకు భయాందోళనలు కలిగిస్తున్నారు. కొందరు మందుబాబులు ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంచుకొని, మారుమూల గ్రామాల్లో మైదానప్రాంతాలను తమ వేదికలుగా మార్చుకొని మద్యం తాగుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లోని రహదారుల వెంట, అటవీ ప్రాంతం, రోడ్ల వెంట ఉన్న చెట్ల కింద తదితర ప్రాంతాలను తమ అడ్డాలుగా మార్చుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో బాటసారులు భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో ఇదే తంతు కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. బీరు, బ్రాండి, సీసాలు విచ్చలవిడిగా మైదాన ప్రాంతాల్లో వదిలేయడం, తాగిన మత్తులో సీసాలను పగలగొట్టడంలాంటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధమనీ, బహిరంగంగా మద్యం తాగితే చట్టపర చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికార యంత్రాంగం చెప్పినా పట్టింపు కరువవుతున్నది. ఆయా రహదారుల వెంట ఒంటరిగా మహిళలు వెళ్ళాలంటే జంకుతున్నారు. పోలీసులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు పట్టించుకోక పోవడం వల్లనే మందు బాబులు పెట్రేగి పోతున్నారు. ఈ విషయమై పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేసి, మైదాన ప్రాంతాల్లో మద్యం తాగే వారిపై నిఘా పెంచాలని పలువురు కోరుతున్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...