యాదవులు అన్ని రంగాల్లో రాణించాలి


Mon,March 18, 2019 12:48 AM

- యాదవ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు తిరుపతి యాదవ్
కలెక్టరేట్: యాదవులు అన్ని రంగాల్లో రాణించేలా విద్యావంతులు కృషి చేయాలని యాదవ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మారం తిరుపతి యాదవ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో ఆదివారం యాదవ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ముఖ్యుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 2689 మంది యాదవ గ్రాడ్యుయేట్స్ ఉన్నారని తెలిపారు. చాలా కాలం నుంచి యాదవులకు సముచిత స్థానం కల్పించడంలో రాజకీయ పార్టీలు వెనుకంజ వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పలు తీర్మానాలు చేసిన యాదవ గ్రాడ్యుయేట్లంతా టీఆర్‌ఎస్ పార్టీ బలపరుస్తున్న బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు మద్దతునిస్తూ మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని నిర్ణయించారు. సమావేశంలో యాదవ చారిటబుల్ ట్రస్టు ప్రధాన కార్యదర్శి గొడుగు రాజకొమురయ్య, యోపా జిల్లా అధ్యక్షుడు కొమ్ము మల్లేశం యాదవ్, యాదవ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పొలగాని సతీశ్ యాదవ్, చెలకల జితేందర్ యాదవ్, దాడి శ్రీనివాస్ యాదవ్, కలబందం పద్మ, చందర్ యాదవ్, పెంట రవి యాదవ్, మేరుగు అరవింద్ యాదవ్, మల్లెత్తుల సంతోష్ యాదవ్, ఆవుల హరీశ్ యాదవ్, గాండ్ల సతీశ్ యాదవ్, అనిల్ యాదవ్, ఆవుల రాజు యాదవ్, కొమ్మ శ్రీనివాస్ యాదవ్, ఆవుల సరళ, దాడి సతీశ్, బూసబోయిన శ్రీలత, పెంట శ్రీలత, శీలారపు నరేశ్, వేల్పు కుమార్, మారం వెంకటరమణ, మల్లెత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...