నీటి సమస్య లేకుండా చూస్తాం


Mon,March 18, 2019 12:48 AM

-పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ రాజయ్య
-ఎస్సారెస్పీ నీరు ఎల్లమ్మ చెరువులోకి..
పెద్దపల్లిటౌన్: రానున్న వేసవిలో ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎలువాక రాజయ్య తెలిపారు. ఎస్సారెస్పీ కెనాల్ నుంచి వచ్చే నీటిని ఆదివారం పెద్దపల్లి ఎల్లమ్మ చెరువుకు మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో తరలించారు. ముందుగా మున్సిపల్ సిబ్బంది కెనాల్‌లో ఉన్న చెత్త, నిరుపయోగ మొక్కలను తొలగించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ, ఐదు సంవత్సరాలుగా పెద్దపల్లి ప్రజలకు తాగునీటి సదు పాయం కల్పించడంలో మున్సిపాలిటీ విజయం సాధించిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రజలకు కావాల్సిన మౌలికసదుపాయాల కల్పనలో పెద్దపల్లి మున్సిపాలిటీ ముం దున్నదన్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎల్లమ్మ చెరువును ఎస్సారెస్పీ కాలువ ద్వారా వచ్చే నీటితో నింపుతున్నామని పేర్కొన్నారు. దీంతో పట్టణంలోని బావు ల్లో కూడా భూగర్భజలాలు తగ్గిపోయే అవకాశం ఉం డదన్నారు. వేసవి పోయే వరకు ప్రజలకు మున్సిపాలిటీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటా యన్నారు. చైర్మన్ వెంట కౌన్సిలర్ సాబేర్‌ఖాన్, మత్స్య కార్మిక సంఘం సభ్యుడు పిడుగు తిరుపతి, బూతగడ్డ తిరుపతి, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...