అధికారులతో డీజీఎం సమావేశం


Sun,March 17, 2019 03:12 AM

యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియాలోని పర్సనల్ అధికారులు, ఆఫీస్ సూపరింటెండెంట్‌లు, క్లర్క్‌లతో డీజీఎం(పర్సనల్) ఎన్ వెంకటేశ్వర్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు చెల్లించాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్ త్వరగా చెల్లించాలని, మెడికల్ బోర్డు ద్వారా ఇన్వాలిడేషన్ పొందిన కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగం కోసం కౌన్సెలింగ్ త్వరగా నిర్వహించాలని సూచించారు. విరమణ పొందిన ఉద్యోగుల వైద్యానికి సంబంధించిన దరఖాస్తులను త్వరగా పంపించాలని, హౌసింగు బిల్డింగ్ లోన్‌పై వడ్డీమాఫి, క్యాడర్ స్కీం, కోర్టు కేసులు, కార్మికుల గైర్హాజరు తదితర అంశాలపై సమీక్షించి వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పర్సనల్ మేనేజర్ జీ డీవైపీఎం కొత్త చంద్రమౌలి, సంక్షేమాధికారులు ప్రవీణ్‌కుమార్, సునీల్, ఆఫీస్ సూపరింటెండెంట్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...