ఎస్సారెస్పీ పనులను అడ్డుకోవద్దు


Sun,March 17, 2019 03:10 AM

-నిర్వాసితులకు పరిహారం అందజేస్తాం
- డైరెక్టర్ ఆపరేషన్ ఎస్ చంద్రశేఖర్
రామగిరి: ఆర్జీ- 3 డివిజన్‌లోని ఓసీపీ -2, ఏపీఏ డివిజన్‌లోని ఏఎల్పీ ప్రాజెక్ట్‌లకు అడ్డంకిగా ఉన్న ఎస్సారెస్పీ ఎల్- 6 మళ్లింపు పనులను అడ్డుకోవద్దనీ డైరెక్టర్ ఆపరేషన్ ఎస్ చంద్రశేఖర్ కోరారు. శనివారం ఎల్-6 కెనాల్ మళ్లింపు పనులను సందర్శించిన ఆయన ఓసీపీ-2 విస్తరణలో భూ ములు కోల్పోయిన అక్కెపల్లి గ్రామ నిర్వాసితుల తో సమావేశమై చర్చించారు. ఓసీపీ-2 ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు తగి న పరిహారం అందించనున్నట్లు తెలిపారు. ఎవరైనా తమ భూములకు సంబంధించిన వరకు పట్టా నంబర్లు తప్పులుంటే వాటిని సవరించే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్జీ-3, ఏపీఏ జీఎంలు కే సూర్యనారాయణ, బీ వీరారెడ్డి, ఓసీపీ -2 ప్రాజెక్ట్ అధికారి మచ్చగిరి నరేందర్, డీజీఎం సివిల్ పల్లెర్ల నాగేశ్వర్‌రావు, సెక్యూరిటీ ఆఫీసర్ ఇనుగాల లక్ష్మీనారాయణ, అక్కెపల్లి గ్రామ సర్పంచ్ సిద్ద రాజయ్య, నిర్వాసితులు తదితరులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...