టీబీజీకేఎస్‌లో చేరికలు


Sun,March 17, 2019 03:09 AM

ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్ నాయకులకు కండువా ఆహ్వానించిన వెంకట్రావ్
గోదావరిఖని,నమస్తేతెలంగాణ: రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడీకే-5 గనిలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్ యూనియన్లకు చెందిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు శనివారం గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌లో చేరారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ ముఖ్యఅతిథిగా హాజరై వివిధ కార్మిక సంఘాల నుంచి టీబీజీకేఎస్‌లో చేరిన నాయకులు, కార్యకర్తలకు కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వనించారు. యూనియన్‌లో చేరిన వారిలో ఎం.పి చారి, దుబాసి వెంకటస్వామి, బత్తి శ్రీనివాస్, చంద్రమోహన్, బీ సాయిలు, బీ ప్రసాద్, ఆకుల రవి, శ్రీమన్నారాయణ, శ్రీనివాస్‌గౌడ్, సంపత్‌రావు, ఎ బాలక్రిష్ణ, జీ నాగరాజు, కే సదానందం, బీ శ్రీనివాస్, లింగమూర్తి, రాంకుమార్‌లతో పాటు 100 మంది ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల అమితమైన ప్రేమాభిమానాలతో అనేక సమస్యలను పరిష్కారం చేశారని, అయినప్పటికీ జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్ యూనియన్లకు చెందిన నాయకులు విమర్శలు చేస్తున్నారనీ, ఇది సరైంది కాదని సూచించారు. కార్మికులకు టీబీజీకేఎస్ ఇచ్చిన అన్ని హామీలను దాదాపుగా నెరవేర్చిందని, కొన్ని హామీలు న్యాయపరమైన చిక్కుల కారణంగానే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.

వాస్తవ అంశాలను టీబీజీకేఎస్ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కోల్‌బెల్ట్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ కార్మిక సంఘాల నుంచి భారీ సంఖ్యలో చేరికలు జరుగుతున్నాయని, జీడీకే-5 గనిలో పెద్ద సంఖ్యలో కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరడం చూసి ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ మండ రమేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చర్చల కమిటీ ప్రతినిధులు పెద్దపల్లి సత్యనారాయణ, దేవ వెంకటేశం, నాయకులు నూనె కొమురయ్య, ఎల్ వెంకటేశ్, ఎట్టం కృష్ణ, కనకం శ్యాంసన్, నాయిని మల్లేశ్, అప్పాల కృష్ణమూర్తి, పర్లపల్లి రవి, పుట్ట రమేశ్, కుశనపల్లి శంకర్, మల్లారెడ్డి, వడ్డేపల్లి శంకర్, బీ అంతయ్య, పీ నారాయణ, తోట లక్ష్మయ్య, పాపారావు, యాదయ్య, ఉయ్యూరు లక్ష్మయ్య పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...