పది పరీక్షలు ప్రారంభం


Sun,March 17, 2019 03:06 AM

- ఎన్టీపీసీ టీటీఎస్‌లోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ దేవసేన
- తగిన వసతులు కల్పించాలని ఆదేశం
- పలు కేంద్రాలను పరిశీలించిన అధికారులు

ఫెర్టిలైజర్‌సిటీ: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పారిశ్రామిక ప్రాంతంలో 11 పరీక్ష కేంద్రాల్లో మొదటి పరీక్ష ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 2790 మంది విద్యార్థులకు గానూ 2784మంది (99.73) శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష కేంద్రాల కోసం 133 మంది ఇన్విజిలెటర్లను కేటాయించారు. ైఫ్లెయింగ్ స్కాడ్, సిట్టింగ్ స్కాడ్ కొన్ని కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు.

జ్యోతినగర్: ఎన్టీపీసీ టీటీఎస్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ శ్రీదేవసేన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించారు. పరీక్ష రాసే సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుం డా తగిన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందుబాటులో తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల కోసం వైద్యశాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకొని విద్యార్థులు అస్వస్థకు గురికాకుండా చేసుకోవాలన్నారు. విద్యార్థులు స్వల్ప అస్వస్థకు గురైన వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేసి వైద్యం అందించాలని కలెక్టర్ సూచించారు. ఆమెవెంట పలువురు అధికారులు ఉన్నారు.

యైటింక్లయిన్‌కాలనీ: పట్టణంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శనివారం సింగరేణి సెక్టార్-3 పాఠశాలలో జరిగిన పది పరీక్ష ఏర్పాట్లను గోదావరిఖని టూటౌన్ సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సహాదేవ్‌సింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సింగరేణి సెక్టార్-3 పాఠశాలలో పరీక్షా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షకు వందశాతం మంది విద్యార్థులు హాజర య్యారనీ చీఫ్ సూపరిండెంట్ పీ చంద్రయ్య పేర్కొన్నారు.

రామగుండంరూరల్/ పాలకుర్తి: రామగుండం పట్టణంతోపాటు, పాలకుర్తి మండలంలోని పలు పదో తరగతి పరీక్షాకేంద్రాల్లో మొదటిరోజు ప్రశాంతంగా జరిగింది. రామగుండం పట్టణంలోని రామగుండం ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల, గురుకుల పాఠశాలల్లో, పాలకుర్తి మండలంలోని బసంత్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జయ్యారం ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం ఐదు కేంద్రాల్లో 1340 మంది విద్యార్థులు కేటాయించగా 100శాతం హాజరు నమోదైంది. రామగుండం ఎస్‌ఐ దత్తాద్రి, బసంత్‌నగర్ ఎస్‌ఐ ఉమాసాగర్‌లు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతర్గాం: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా, మండలంలోని పొట్యాల, అంతర్గాం, విలేజీ రామగుండం పాఠశాలకు చెందిన 191 మంది విద్యార్థులకు 191 మంది హాజరై పరీక్షలు రాసినట్లు ఇన్విజిలెటర్ జింక మల్లేశం తెలిపారు. కాగా, అంతర్గాం ఎస్‌ఐ రామకృష్ణ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరీక్షించడంతోపాటు బందోబస్తు విషయమై అధికారులతో చర్చించారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...