పంచాయతీలకు నిధుల వరద!


Sun,March 17, 2019 03:05 AM

- 13.13కోట్లు విడుదల
- 14వ ఆర్థిక సంఘం కింద 12.41కోట్లు
- ఎస్‌ఎఫ్‌సీ కింద మరో 8.48లక్షలు
- ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు 58లక్షలు
- ఎస్టీ సబ్ ప్లాన్ 4.86లక్షలు
- సర్వత్రా హర్షం

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పంచాయతీలకు 14వ ఆర్థికసంఘం నిధులతోపాటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మొత్తం కలిసి రూ. 13కోట్ల 13లక్షల, 12వేల 100ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో 14వ ఆర్థికసంఘం నిధులు రెండో విడతలో రూ.12కోట్ల 41లక్షల 75వేల 800 విడుదల కాగా స్టేట్ ఫైనా న్స్ కమిషన్ ద్వారా రూ.8లక్షల, 48వేల,400 విడుదలయ్యాయి. ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా రూ. 58లక్షల, వెయ్యి నిధులు విడుదల కాగా ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా రూ.4లక్షల,86వేల,900ల నిధులు విడుదలయ్యాయి. అయితే జిల్లాకు మంజూరైన నిధుల్లో రెండో విడతలో మంజూరైన 14వ ఆర్థికసంఘం నిధులు కాకుండా మిగిలిన నిధులను ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో జమచేశారు. 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన రూ.12కోట్ల, 41లక్షల, 75వేల 800లకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాత ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తారు.

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను మున్సిపాలిటిల్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే విలీనమైనా గ్రామాలకు నిధులు కేటాయించలా లేదా అనే విషయంపై స్పష్టత వచ్చిన తర్వాత జిల్లాకు కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలకు కేటాయిస్తారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులను అన్నిప్రాంతాల్లో ఖర్చు చేస్తుండగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన నిధులను మాత్రం ఎస్సీ, ఎస్టీలు నివాసం ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఖర్చు చేస్తారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఎలాంటి కొత్త పనులు చేపట్టరాదు. గతంలో నిర్మాణంలో ఉన్న పనులకు లేదా గ్రామ పంచాయతీలో ఉన్న తాగునీటివంటి వివిధ పథకాల నిర్వహణకు వీటిని ఉపయోగించుకోవచ్చును..

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...