రైల్లో నుంచి పడి యువకుడికి తీవ్రగాయాలు


Sun,March 17, 2019 03:02 AM

కలెక్టరేట్: పానిపూరీ అమ్ముకుని జీవనం సాగించే ఓ యువకుడు రైలు నుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సం ఘటన పెద్దపల్లిలో శనివారం జరిగింది. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాలోజుల తంజహరి మం డలం ఝాన్సీ గ్రామానికి చెందిన అనూప్ బతుకుదెరువుకు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో పానిపూరీ బండితో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సొంతూరు వెళ్లేందుకు హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఏపీ రైలులో ప్రయాణం చేస్తూ పెద్దపల్లి జిల్లాలోని అందుగులపల్లి గ్రామంలోని రైల్వేగేటు సమీపంలో రైలు నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అనూప్ తలకు తీవ్రగాయాలు కావడంతోపాటు ఓ కాలు, ఓ చేయి విరిగిపోయింది. స్థానికులు 108కు సమాచారం అందించడంతో హుటాహూటిన అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది ప్రమాదానికి గురైన అనూప్‌ను పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్‌కు పంపించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...