భార్యను చంపిన భర్త అరెస్ట్


Sat,March 16, 2019 01:11 AM

జ్యోతినగర్ : ఎన్టీపీసీ పట్టణ శివారులోని పీకే రామయ్యకాలనీలో ఈ నెల 10న అర్ధరాత్రి లావుడియా రమాదేవి(32) అనే గృహిణి భర్త లావుడియా రాములు అనుమానంతో తలపై ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసినట్లు గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ నింధితుడు భర్త అరెస్టు వివరాలను వెల్లడించారు. రమాదేవిపై భర్త రాములు అనుమానం పెంచుకోవడంతో తరుచూ భార్యభర్తల మధ్య గొడువలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 10న రాత్రి ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. భర్త రాములు ఇనుప రాడ్‌తో భార్య తలపై మోదడంతో తలకు బలమైన గాయమైంది. తల్లిదండ్రుల గొడువను చూసిన 12 ఏళ్ల కూతురు అనుదీపిక బయటకు వెళ్లి సమీప కాలనీలో ఉన్న తన బంధువులకు జరుగుతున్న గొడవ విషయం చెప్పగా, వారు ఇంటికి వచ్చేసరి రమాదేవి తలకు తీవ్ర గాయాలతో ఉంది. వెంటనే కరీంనగర్ దవాఖానకు తరలించగా రమాదేవి మృతి చెందింది. మృతురాలి సోదరుడు దారవత్ లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు రాములపై ఎన్టీపీసీ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా శుక్రవారం రాములు తన ఇంటి వద్ద పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. వెంటనే రాములను అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన రాడ్‌ను స్వాధీన చేసుకుని, రాములను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీపీ వివరించారు. సమావేశంలో రామగుండం సీఐ బి స్వామి, ఎన్టీపీసీ ఎస్‌ఐ శంకరయ్య ఉన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...