నేటి నుంచి ఒంటి పూట బడులు


Fri,March 15, 2019 02:35 AM

కలెక్టరేట్ : రోజురోజుకూ ఎండలు పెరుతున్న దృష్ట్యా శుక్రవారం నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటి పూట బడు లు నిర్వహించాలని విద్యాశాఖ ఆధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 13 వరకు ఈ విద్యాసంవత్సరాన్ని పూర్తి చేసి ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులకు కేటాయించారు. తిరిగి నూతన విద్యాసంవత్సరం జూన్ 1న ప్రారంభం కానుంది. ఒంటి పూట బడులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలని అధికారులు సూచించారు. ఒంటి పూట బడుల నిర్వహణలో ప్రయివేట్ యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...