భారత్ దర్శన్‌కు విద్యార్థుల ఎంపిక


Fri,March 15, 2019 02:35 AM

మంథని, నమస్తే తెలంగాణ : మంథని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో చదువుతున్న 19 మంది విద్యార్థులు సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించిన భారత్ దర్శన్‌కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ జీ. వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. మంథని గురుకులంలో బైపీసీ చదువుతున్న టీ. శ్రీనాథ్, ఎల్. మహేందర జే. శ్రావణ్, ఎంపీసీ చదువుతున్న ఎం. ఉపేందర కే. నవీన్‌రాజ్, కే. మహేందర్, ఎన్. శ్రీనివాస్, పదో తరగతి చదువుతున్న సీహెచ్ ఉదయ్, బీ. రాకేశ్, పీ. మహేశ్, ఈ. శివకుమార్, 9వ తరగతి చదువుతున్న టీ. తేజ, ఆర్. సురేశ్, డీ. విష్ణు, 8వ తరగతి చదువుతున్న ఎం. సిరిత్, సీహెచ్ వంశీ, ఆర్. సురేశ్, కే. శ్రీరామ్, కే. రవితేజలు వివిధ విభాగాల్లో ప్రతిభను చూపి భారత్ దర్శన్‌కు ఎంపికైనట్లు తెలిపారు. 2017-18విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో భారత్ దర్శన్‌కు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు మంథని గురుకులం నుంచే ఎంపికైనట్లు తెప్పారు. ఈ విద్యార్థులు రెండు విడతలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని చెప్పారు. మొదటి విడతలో 8 మంది విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో పర్యటించారనీ, రెండు విడతగా 11మంది విద్యార్థులు రేపటి నుంచి 5 రోజుల పాటు చెన్నై మహాబలిపురం, పాండిచ్చేరిలో పర్యటిస్తారన్నారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు బీ. మురళి, పీ. గిరి ప్రసాద్, డీ. నవీన్, ఐఆర్‌వీ రాజు అభినందించారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...