శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్


Fri,March 15, 2019 02:35 AM

-చట్ట వ్యతిరేఖ చర్యలకు శిక్ష తప్పదు
-గోదావరిఖని ఏసీపీ ఉమేందర్
-25 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు స్వాధీనం
యైటింక్లయిన్ కాలనీ : శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ పేర్కొన్నారు. కేకే నగర్, వెంకట్రావుపల్లిలో గోదావరిఖని టూటౌన్ సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సర్చ్‌లో గోదావరిఖని ఏసీపీ పాల్గొన్నారు. గురువారం రాత్రి ప్రత్యేక పోలీసు బలగాలతో గ్రామాన్ని దిగ్భందం చేశారు. అనంతరం ఏసీపీలు వేరుగా సిబ్బందితో కలసి గ్రామంలోని ఇండ్లను తనిఖీ చేసి సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా అనుమానిత వ్యక్తుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పారిశ్రామిక ప్రాంతంలో ఇటీవల మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయన్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన, ఈవ్‌టీజీంగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వల్ల యువత పెడదారినపడుతున్నదనీ, దీని నియంత్రణకు తల్లిదండ్రులు నిఘా పెంచి నియంత్రించాలని సూచించారు. అలాగే, కార్డన్ సెర్చ్ వల్ల సంఘ విద్రోహులను గుర్తించడంతోపాటు, నేరాలను అదుపులోకి తేవచ్చునన్నారు. గ్రామంలో ప్రజల సహకారంతో వాడవాడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం తప్పనిసరి అన్నారు. ప్రజలు నిర్భయంగా ఎలాంటి సమస్యనైనా తమ దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో పోలీస్ అధికారులు నారాయణ, గోలిరవికుమార్, స్వామి, వెంకటేశ్వర్లు, లకా్ష్మరెడ్డి, ఓడేటి కృష్ణారెడ్డి, డిస్ట్రిక్ గార్డులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...