సమాచార హక్కు చట్టంపై అవగాహన


Fri,March 15, 2019 02:35 AM

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్‌టీఐ కాంపెయిన్, మదర్ హ్యూమన్ యూత్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థినులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ మేరకు స్థానిక 18వ డివిజన్ పరిధిలో ఓ ప్రైవేటు ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థినులకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, పని విధానాలపై అవగాహన కల్పించడంలో భాగంగా మొదటి రోజు గురువారం సమాచార హక్కు చట్టంపై యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్‌టీఐ కాంపెయిన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వెంకటేశ్వర్లు వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, శాఖలలో పీఐఓ అప్పిలేటివ్ అథారిటీ, రాష్ట్ర కమిషన్ వరకు సమస్యల పరిష్కారం కోసం సమాచార హక్కు చట్టం ఏ విధంగా ఉపయోగపడుతుందనీ, అధికారులు కూడా సమాచార హక్కు చట్టం ద్వారా ఏలా స్పందిస్తూ కోరినా సమాచారం 30 రోజుల్లో అందిస్తున్నారా లేదా ప్రభుత్వ పాలనలో ప్రజలకు జవాబుదారీగా ఉంటుందా, పారదర్శకంగా ప్రజా పరిపాలనలో ప్రభుత్వ అధికారుల ద్వారా సకాలంలో సమాచారాన్ని అందిస్తున్నారా లేదా అనే దానిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మదర్ హ్యూమన్ సొసైటీ అధ్యక్షుడు పిట్టల రాజ్‌కుమార్, ఎం.రాజేశం, వినయ్, శ్వేత, చిరంజీవి తదితరులున్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...