అభివృద్ధి కాంక్షతోనే చేరికలు


Fri,March 15, 2019 02:34 AM

కలెక్టరేట్: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న వారంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పెద్దపల్లి మండలంలోని రాగినేడు గ్రామానికి చెందిన ఎరుకల సువర్ణ, సత్యనారాయణగౌడ్‌తోపాటు 50మందికి పైగా టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు వచ్చిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందుతున్న వారంతా టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో పార్టీలో చేరుతున్నారన్నారు. గ్రామాలాభివృద్ధిని కాంక్షిస్తున్న ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌తో కలిసి నడిచేందుకు ముందుకొస్తున్నారనీ, అలాంటి వారందరికి స్వాగతం చెబుతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాటపడుతున్న బంగారు తెలంగాణ నిర్మాణం కోసం యువత తోపాటు అందరూ ముందుకురావాలని దాసరి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మల్క కుమారస్వామి, నాయకులు సందనవేని రాజేందర్ యాదవ్, కలబోయిన మహేందర్, స్వరూప్‌గౌడ్, కాల్వ శంకర్, గూడాళ్ల లింగయ్య, వేల్పుల సత్యనారాయణ, చింతపండు లక్ష్మయ్య, పడాల తిరుపతిగౌడ్, ఇల్లందుల పర్శరాములుగౌడ్ పలువురు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...