జూనియర్ సివిల్ జడ్జి పార్థసారధిరావు


Fri,March 15, 2019 02:34 AM

సుల్తానాబాద్: ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పదని సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి పార్థసారధిరావు అన్నారు. బుధవారం కోర్టు అవరణలో ద్వితీయశ్రేణి న్యాయమూర్తి కే నారాయణ పదవీ విరమణ కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్జి పార్థసారధిరావు మాట్లాడుతూ.. విధులను ఇష్టంగా చేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. న్యాయమూర్తి నారాయణ సుల్తానాబాద్ కోర్టుతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందనీ, అతనిపై ఎలాంటి మచ్చ లేదనీ, తన పనికి తగిన న్యాయం చేశాడని కొనియాడారు. ఆయన పనిచేసింది కొంతకాలమే అయినా ఆయన నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నాననీ, వివాదరహితుడుగా పేరు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు. పదవీ విరమణ చేస్తున్న న్యాయమూర్తి నారాయణ మాట్లాడుతూ.. తనకు సహకారించన వారిని ఎన్నడూ మరవలేననీ తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంపెల్లి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి కే నారాయణను ఘనంగా శాలువాతో పాటు, పుష్పగుచ్ఛాలు ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఏజీపీ శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి వోడ్నాల రవీందర్, బీ బాలకిషన్‌ప్రసాద్, ఆవుల లక్ష్మీరాజం, మాడూరి ఆంజనేయులు, లక్ష్మీకాంతరెడ్డి, పడాల శ్రీరాములు, సర్వోత్తమ్‌రెడ్డి, సత్యనారాయణ, పడాల అంజయ్య, బీ భూమయ్య, వీ తిరుపతి, రమేశ్, ఆనంద్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...